Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సీటెట్' రిజిస్ట్రేషన్ల విండో పునఃప్రారంభం!

'సీటెట్' రిజిస్ట్రేషన్ల విండో పునఃప్రారంభం!

వార్త 3 weeks ago

CTET 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 22వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET 2026) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.

గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు సీబీఎస్‌ఈ మరో అవకాశం కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్ విండో ఆగస్టు 25న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.

Read Also :PM Internship Scheme: నెలకు రూ. 9,000 స్టైపెండ్.. 3వ విడత దరఖాస్తులు ప్రారంభం!

సుప్రీంకోర్టు తీర్పుతో రీ-ఓపెన్

పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టీఈటీ (TET) అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఉపాధ్యాయులందరికీ తగిన సమయం ఇచ్చి, వారు ఈ చట్టబద్ధమైన నిబంధనను నెరవేర్చేలా చూడాలనే ఉద్దేశంతోనే అప్లికేషన్ పోర్టల్‌ను తిరిగి తెరిచారు.

  • మునుపటి షెడ్యూల్: 22వ సీటెట్ నోటిఫికేషన్ మే 8న విడుదల కాగా, మే 11 నుండి జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
  • తాజా గడువు:సెప్టెంబర్ 1, 2026 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CTET 2026: పరీక్ష తేదీ వివరాలు

గతంలో ఈ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ, దరఖాస్తు విండో పునఃప్రారంభం కావడంతో పరీక్ష తేదీ మారనుంది. సెప్టెంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సవరించిన పరీక్షా తేదీని (Revised Exam Date) సీబీఎస్‌ఈ అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటివరకు సీబీఎస్‌ఈ మొత్తం 21 విడతల్లో సీటెట్ పరీక్షలను నిర్వహించింది. 21వ ఎడిషన్ ఫలితాలు ఈ ఏడాది మార్చి 30న విడుదలయ్యాయి.

యూజీసీ నెట్ 2026 ఫలితాలు విడుదల.. కట్-ఆఫ్స్ ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha