Sea Turtle Viral Video: ప్రకృతి ఒడిలో, ముఖ్యంగా సముద్ర గర్భంలో వింతలకు కొదవ ఉండదు. తాజాగా క్రిస్టోఫర్ చాంగ్ అనే ట్రావెలర్‌కు ఎదురైన ఒక అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సముద్రపు తాబేళ్లు సాధారణంగా మనుషులను చూడగానే భయపడి దూరంగా వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
Read Also:Marco Rubio DJ Video: అమెరికా భద్రతా సలహాదారు డీజే అవతారం.. నైట్ క్లబ్‌లో మార్కో రుబియో!
చాంగ్‌ను వెంటాడిన తాబేలు
క్రిస్టోఫర్ చాంగ్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తున్నాడు. ఆ సమయంలో ఒక తాబేలు అతనికి తారసపడింది. అది వెళ్ళిపోకుండా చాంగ్ ఎటు వెళ్తే అటు తిరుగుతూ అతని చుట్టూనే ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపు అతన్ని గమనించిన ఆ తాబేలు, ఒక్కసారిగా అతని వైపు దూసుకొచ్చి తన ముందరి కాలితో చాంగ్ చెంపపై చిన్నగా కొట్టేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయమైపోయింది.
'నా జీవితంలోనే మొదటిసారి'
తానూ వందల సార్లు సముద్రంలో తాబేళ్లను చూశానని, కానీ ఇలాంటి వింత ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని చాంగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను అతను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
Sea Turtle Viral Video: నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో నవ్వులు పూయించే కామెంట్స్ చేస్తున్నారు:
- "నువ్వు వేరే వాళ్ళ ఇంట్లోకి (సముద్రం) వచ్చి సౌండ్ చేస్తున్నావు.. అందుకే అది నోరు మూసుకోమని కొట్టింది" అని ఒకరు కామెంట్ చేయగా..
- "పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే ఏ తాబేలైనా అలాగే రియాక్ట్ అవుతుంది" అని మరొకరు సరదాగా రాసుకొచ్చారు.
మొత్తానికి ఈ 'తాబేలు దెబ్బ' వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సంబంధాల పునరుద్ధరణకు మార్కో రూబియో రోమ్ పర్యటన!

