Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ

స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ

వార్త 2 weeks ago

CP Sajjanar: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, రవాణా భద్రత, మాదకద్రవ్యాల నిరోధంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ విద్యాసంస్థలకు పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

రవీంద్రభారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మైనర్ విద్యార్థులు టూవీలర్లు లేదా కార్లు నడపడం చట్టరీత్యా నేరమని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆ వివరాలను నేరుగా వారి పాఠశాలలకు పంపిస్తామని, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేలా యాజమాన్యాలు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.

Read also: Revanth Reddy: 'యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్' పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

స్కూల్ బస్సుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు.. అసెంబ్లీల్లో సైబర్ నేరాలపై అవగాహన!

చిన్నారులను పాఠశాలలకు చేర్చే బస్సుల డ్రైవర్ల విషయంలో యాజమాన్యాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు. ఇటీవల స్కూల్ బస్సు డ్రైవర్లు సైతం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. పాఠశాలల గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీటీవీ (CCTV) కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ట్రాఫిక్ మార్షల్స్ లేదా వాలంటీర్లను నియమించుకోవాలని స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఉదయం జరిగే స్కూల్ అసెంబ్లీ (ప్రార్థనా సమయం) విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ఒక వేదిక కావాలని సీపీ పిలుపునిచ్చారు. అక్కడ ట్రాఫిక్ నియమాలతో పాటు సైబర్ నేరాలు, డిజిటల్ వ్యసనం (స్క్రీన్ అడిక్షన్), డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు.

పాఠశాలల చుట్టుపక్కల పొగాకు, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడానికి ‘కోప్టా’ (COTPA) చట్టాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు కూడా తమ పరిసరాలపై నిఘా ఉంచాలని పోలీసులు కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో కఠిన ఆంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha