School Holidays in AP : ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం (School Reopening) పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి విద్యాశాఖ తెరదించింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు అధికారికంగా స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 12వ తేదీ (జూన్ 12) నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు యధావిధిగా తెరుచుకుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. సోషల్ మీడియాలో (Social Media) సెలవుల పొడిగింపుపై వస్తున్న వదంతులు, తప్పుడు వార్తలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గందరగోళానికి గురికావద్దని అధికారులు సూచించారు.
Read Also ; పరిటాల సునీత ఉదారత.. ఒంటరి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ!

జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభం
కొత్త విద్యా సంవత్సరానికి (Academic Year) సంబంధించి జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభం కానున్నందున, పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీకి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఎండ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని స్కూళ్ల రీఓపెనింగ్‌ను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ఏపీలోనూ సెలవులు పెరుగుతాయనే ఆశతో ఉన్న అభ్యర్థులకు విద్యాశాఖ తాజా ప్రకటనతో పూర్తి క్లారిటీ వచ్చింది. జూన్ 12 నుంచే బడులు ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

