Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐరోపా పర్యటనలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. గత 33 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని స్లోవేకియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్నారు. 1993లో ఒక స్వతంత్ర దేశంగా స్లోవేకియా అవతరించిన తర్వాత, ఆ దేశ గడ్డపై అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
PM Modi Europe Tour
Read also: Indian Army Dress : ఇండియన్ ఆర్మీకి సరికొత్త యూనిఫామ్
‘బ్రెడ్ అండ్ సాల్ట్’తో సాంప్రదాయ స్వాగతం
బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ అక్కడి సాంప్రదాయ పద్ధతి అయిన ‘బ్రెడ్ అండ్ సాల్ట్’ అందించి ఘన స్వాగతం పలికారు. ఈ చారిత్రక పర్యటన భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో మోదీ ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. అలాగే ఆ దేశ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Narendra Modi: పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశాలు ఇవే..
భారత్, స్లోవేకియా దేశాల మధ్య ప్రస్తుతం సుమారు 1.6 బిలియన్ యూరోల విలువైన వాణిజ్యం సాగుతోంది. ఈ బంధాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ముఖ్యంగా కింది రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డిజిటల్ టెక్నాలజీ, రక్షణ మరియు ఆటోమొబైల్ రంగాలు, క్లీన్ ఎనర్జీ (హరిత ఇంధనం),యూరోపియన్ యూనియన్ (EU) తో పాటు నాటో (NATO) లో కీలక సభ్యదేశమైన స్లోవేకియాతో బంధం పటిష్టం కావడం వల్ల.. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలకు మరింత బలం చేకూరనుంది.
తదుపరి షెడ్యూల్: ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సు
స్లోవేకియా పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా ఫ్రాన్స్ బయలుదేరనున్నారు. జూన్ 16, 17 తేదీలలో అక్కడ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక జీ7 (G7) శృంగార సదస్సులో ఆయన పాల్గొంటారు. దానితో పాటు, పారిస్‌లో జరగబోయే ప్రముఖ సాంకేతిక ఈవెంట్ ‘వివాటెక్ 2026’ (VivaTech 2026) కు హాజరవుతారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్‌లోని ప్రవాస భారతీయులతో (డయాస్పోరా) కూడా ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

