Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియన్ ఆర్మీకి సరికొత్త యూనిఫామ్

ఇండియన్ ఆర్మీకి సరికొత్త యూనిఫామ్

వార్త 2 weeks ago

Indian Army : భారత సైన్యం (Indian Army) తన సాంప్రదాయ దుస్తుల నియమావళిలో (Uniform Code) విప్లవాత్మక మార్పులు చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా అధికారుల 'సివిల్ ఫార్మల్ డ్రెస్' లో సరికొత్త మార్పులను ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా దేశీయత ఉట్టిపడేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘స్వదేశీ బ్యాండీ జాకెట్’ (Bandi Jacket) ను ఆర్మీ పరిచయం చేసింది. ఇకపై అధికారిక సివిల్ ఫార్మల్స్ లో భాగంగా అధికారులు ఫార్మల్ ప్యాంట్, ఫుల్ స్లీవ్ షర్ట్‌లపై క్లోజ్డ్ నెక్ కోట్ (బంద్ గల్లా) ధరించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త వస్త్రధారణ సైనికులకు మరింత హుందాతనాన్ని తీసుకురావడమే కాకుండా, భారతీయ మూలాలను గర్వంగా చాటిచెప్పేలా రూపొందించబడింది.

Read Also : ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది !!

బ్రిటిష్ కాలం నాటి గుర్తులు, ఆచారాలకు ముగింపు.. పౌచ్ బెల్ట్, కత్తుల సంప్రదాయానికి స్వస్తి

శతాబ్దాల నాటి వలసరాజ్యాల (బ్రిటిష్ కాలం) బానిసత్వ ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో భారత ఆర్మీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బ్రిటీషర్ల కాలం నుండి వస్తున్న ‘రాయల్’ వంటి పదాల వినియోగాన్ని ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. దాంతో పాటు బ్రిటీష్ సైనిక సంప్రదాయానికి చిహ్నాలుగా ఉన్న పౌచ్ బెల్ట్‌లను (Pouch Belts), అలాగే ఉన్నతాధికారులు అధికారికంగా కత్తులను (Swords/Ceremonial Swords) వెంట ఉంచుకునే పాతకాలపు పద్ధతులకు శాశ్వతంగా స్వస్తి పలికింది. ఈ సంస్కరణల ద్వారా భారత సైన్యం పూర్తి స్వదేశీ హంగులతో, ఆధునిక సార్వభౌమత్వ దేశంగా సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అధికారిని చెప్పుతో కొట్టిన రైతు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha