Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మిత్‌ను అప్యాయంగా ముద్దు పెట్టిన దుబాయ్ ప్రిన్స్‌

స్మిత్‌ను అప్యాయంగా ముద్దు పెట్టిన దుబాయ్ ప్రిన్స్‌

వార్త 2 weeks ago

Smit Machchhar: 'ఫ్లైదుబాయ్‌' విమానంలో మిడ్-ఎయిర్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ వేగంగా కోలుకుంటున్నారు.

ఈ క్రమంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్మిత్ మచ్చార్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా స్మిత్‌ను ఆయన ఆత్మీయంగా ముద్దుపెట్టుకుని అభినందించారు. తోటివారి ప్రాణ రక్షణ కోసం స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని షేక్ హమ్దాన్ కొనియాడారు.

Rammohan Naidu: బీసీ రిజర్వేషన్లపై వైసీపీకి మాట్లాడే హక్కు లేదు: రామ్మోహన్ నాయుడు

“ప్రాణాపాయ స్థితిలోనూ స్మిత్ చూపిన తెగువ, బాధ్యత అసాధారణమైనవి. యూఏఈ నాయకత్వం తరఫున ఆయనకు మా సెల్యూట్! స్మిత్ మా యూఏఈ బృందంలో ఒకరిగా ఉండటం మా అదృష్టం. మానవత్వం, శాంతిభద్రతలు, ప్రాణరక్షణకు మారుపేరుగా నిలిచే యూఏఈ ఉన్నత విలువలను స్మిత్ మచ్చార్ నిజమైన కథానాయకుడిగా ప్రతిబింబించారు” అని షేక్ హమ్దాన్ 'ఎక్స్' లో పేర్కొన్నారు.

ఆసుపత్రిలో స్మిత్ మచ్చార్‌తో ముచ్చటించి, ఆయనను ఆత్మీయంగా అభినందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే స్మిత్ ధైర్యసాహసాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ దేశాల నేతలు కొనియాడిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే?
బుధవారం 'ఫ్లైదుబాయ్' సంస్థకు చెందిన ఎఫ్ జెడ్ 1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వైపు ప్రయాణిస్తోంది. క్యాబిన్ కంట్రోల్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ చేతిలో ఉన్న సమయంలో, ఓమాన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో అకస్మాత్తుగా స్మిత్‌పై కోక్‌పిట్ గొడ్డలి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో విమానం నియంత్రణ తప్పి, కేవలం ఒక్క నిమిషంలోనే ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో విమానం కూలిపోతోందని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కో-పైలట్ జరిపిన దాడిలో తీవ్ర రక్తస్రావమై, దాదాపు స్పృహ తప్పే స్థితిలో ఉన్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తన మనోధైర్యాన్ని కోల్పోలేదు.

అతి కష్టం మీద స్మిత్ కోక్‌పిట్ తలుపులు తెరచి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే కోక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

భారతీయులున్న నౌకపై మిస్సైల్ అటాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha