Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్నేహితుడా.. సైకోనా?.. ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టి తోటి విద్యార్థిని ప్రాణం తీసిన క్లాస్‌మేట్

స్నేహితుడా.. సైకోనా?.. ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టి తోటి విద్యార్థిని ప్రాణం తీసిన క్లాస్‌మేట్

వార్త 0 months ago

Kerala medico murder: ఉజ్బెకిస్తాన్‌లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న కేరళకు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థిని సావారియా బసంత్ దారుణ హత్యకు గురైంది.

కేరళలోని అలప్పుజా జిల్లా హరిపాడ్‌కు చెందిన సావారియా, మలప్పురానికి చెందిన సదరుల్ అనామ్ (22) ఇద్దరూ ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నారు. జులై 23న వీరిద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీయడంతో సావారియా ప్రాణాలు కోల్పోయింది.

సావారియా మృతి కేవలం సాధారణ గొడవ వల్ల జరిగింది కాదని, ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు అనామ్ ల్యాప్‌టాప్‌తో తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోలేదని, ఆమె శరీరం అంతటా తీవ్ర గాయాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మృతురాలిని మతం మారాల్సిందిగా నిందితుడు నిరంతరం బలవంతం చేసేవాడని, దీనిని అక్కడ చదువుతున్న పలువురు తోటి విద్యార్థులు కూడా గమనించారని ఉజ్బెకిస్తాన్ దర్యాప్తు అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Read Also : Jogulamba Gadwal crime: దారుణం.. పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడి దారుణ హత్య..!

 Friend or psycho? Classmate kills fellow student by striking her on the head with a laptop.

Kerala medico murder: రెండు దేశాల చట్టాల పరిధిపై పోలీసుల వివరణ

నేరం ఉజ్బెకిస్తాన్‌లో జరిగినప్పటికీ, భారత పౌరురాలిపై జరిగిన ఘాతుకం కావడంతో ఇక్కడ కేసు నమోదు చేయడానికి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని సీనియర్ పోలీస్ అధికారి బినూకుమార్ తెలిపారు. “ఉజ్బెకిస్తాన్ పోలీసులు నిందితుడిపై అక్కడే పూర్తిస్థాయి విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే, మేము ఇక్కడ నమోదైన కేసును మూసివేస్తాం. ఒకవేళ అక్కడ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, మేము ఈ కేసును ఇక్కడే ముందుకు తీసుకువెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

నిందితుడిని అప్పగించాలని తల్లిదండ్రుల డిమాండ్

ప్రస్తుతం నిందితుడు సదరుల్ అనామ్‌ను ఉజ్బెకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే, ఈ కేసు విచారణ పూర్తిగా కేరళలోనే జరగాలని, నిందితుడిని ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్‌కు అప్పగించేలా (Extradition) చర్యలు తీసుకోవాలని సావారియా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కేరళ పోలీసులు స్పందిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి, చట్టపరమైన, న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత నిందితుడి అప్పగింతకు ఏవైనా నిబంధనలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని తెలిపారు. భారత రాయబార కార్యాలయం ద్వారా ఉజ్బెకిస్తాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షిస్తామని అధికారులు వెల్లడించారు.

వయనాడ్ దుర్ఘటన: 6కు చేరిన మృతుల సంఖ్య.. రాజకీయ రంగు పులుముకున్న విపత్తు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha