Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోదరుడి వివాహానికి వచ్చి విగతజీవిగా మారిన అన్న

సోదరుడి వివాహానికి వచ్చి విగతజీవిగా మారిన అన్న

వార్త 1 month ago

Vizianagaram Crime: విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని మిర్తివలస గ్రామంలో అంతులేని విషాదం నెలకొంది. తమ్ముడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న ఆ అన్న, విద్యుదాఘాతానికి గురై అదే పెళ్లి రోజున ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది.

Read Also: Akkannapet News: మేడే రోజు గ్రామపంచాయతీ కార్మికుడి పై చెప్పుతో దాడి

పూర్తి వివరాల్లోకి వెళితే.. పొన్నాడ రమణ చిన్న కుమారుడు దిలీప్ కుమార్‌ పెళ్లి ఈరోజు జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇంట్లో పెళ్లి పనులు, ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రెండో కుమారుడు సతీష్ (32) స్నానం చేసిన అనంతరం దుస్తులు ఆరబెట్టేందుకు ఇంటి మేడపైకి వెళ్లాడు.ఈ క్రమంలో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు.

 Vizianagaram Wedding Tragedy News

Vizianagaram Crime: కుటుంబంలో విషాదం

వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సతీష్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి ఇంట్లో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు, బిల్లు మాత్రం 32 లీటర్లు! వింత మోసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha