Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేడే రోజు గ్రామపంచాయతీ కార్మికుడి పై చెప్పుతో దాడి

మేడే రోజు గ్రామపంచాయతీ కార్మికుడి పై చెప్పుతో దాడి

వార్త 1 month ago

Akkannapet News: అక్కన్నపేట మండలం రామవరం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది బోనగిరి శ్రీనివాస్‌పై అదే గ్రామానికి చెందిన లింగాల నరసయ్య చెప్పుతో దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి వద్ద నల్లా నీరు పెట్టాలని నరసయ్య కోరగా, కొద్దిసేపటికి ఎల్లమ్మ గుడి వైపు నల్లాలు తిప్పిన కొద్దిసేపటికి తిప్పుతానని శ్రీనివాస్ తెలిపాడు.

Read Also:Sitaram Suicide Case updates: 19 పేజీల టెకీ సీతారాం సూసైడ్ నోట్.. కళ్లు చెదిరే నిజాలు!

Akkannapet News: అయితే తమ ఇంట్లో పండగ జరుగుతోందని, వెంటనే నీరు కావాలని ఆవేశానికి లోనైన నరసయ్య చెప్పుతో దాడి చేసినట్లు శ్రీనివాస్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాము ఎదుట కన్నీరుమున్నీరుగా వాపోయాడు. ఈ ఘటనపై కార్యదర్శి రామును అడగగా, చెప్పుతో కొట్టిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి, అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉద్యోగం రాలేదని బీటెక్ యువతి ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha