Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోదరుడిగా వస్తే ఆదరిస్తాం.. పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోం!

సోదరుడిగా వస్తే ఆదరిస్తాం.. పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోం!

వార్త 2 months ago

KTR Counter to Pawan Kalyan:హైదరాబాద్‌లో జనసేన అంతర్గత సభకు అనుమతి నిరాకరణ, ఆపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ పరిణామాలపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఇటు జనసేనాని మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరస్పరం చేసుకున్న తీవ్ర వ్యాఖ్యలు, కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.

Read Also :Pawan Kalyan: అదే నా రస్తా.. ఎక్స్‌ వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!

 High-Volt Political War Sparks Over Hyderabad Janasena Meeting Cancelled

KTR Counter to Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్‌లో జనసేన సభ నిర్వహణ, ఏపీ నేతల ప్రస్తావనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అత్యంత ఘాటుగా స్పందించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఇక్కడి పోరాటాల చరిత్రను గుర్తు చేస్తూ పవన్‌కు కొన్ని స్పష్టమైన సరిహద్దులు గీశారు. “తెలంగాణ ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఎప్పుడూ కేసీఆర్ గారే. దేశభక్తి గురించి, పోరాటాల గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఆయనను నటుడిగా మేము గౌరవిస్తాము, ఒక సోదరుడిగా మా ఇంటికి వస్తే మర్యాదగా బిర్యానీ పెట్టి ఆదరిస్తాము. కానీ, మా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి పెత్తనం చేస్తామంటే మాత్రం ఇక్కడి ప్రజలు ఊరుకోరు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.”ఎన్నో బలిదానాలు, దశాబ్దాల కష్టాల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణను సాధించుకున్నాము. అలాంటప్పుడు మళ్లీ ఇక్కడికి వచ్చి ఏపీ నేతలు పెత్తనం చలాయించాలనుకోవడం ఏంటి?” అని ఆయన గట్టిగా ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ సంచలన రియాక్షన్ – ‘జాతీయ గీతం’ ప్రస్తావన

తన జూబ్లీహిల్స్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ నేతల నుంచి వస్తున్న ఈ ‘ప్రాంతీయవాద’ విమర్శలపై తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ దేశ సమగ్రతను తెరపైకి తెచ్చారు. “తెలంగాణ ప్రజలను లేదా ఇక్కడి రాజకీయ నేతలను ఇలాగే వదిలేస్తే.. ప్రాంతీయ అభిమానం, విద్వేషాలు మరీ ఎక్కువైపోతాయి. ఈ ధోరణి ఇలాగే పెరిగితే, ఒకరోజు మేము భారతదేశంలో భాగం కాదు.. మాకు వందేమాతరం వద్దు, జాతీయగీతం (National Anthem) కూడా పాడము అనే స్థాయికి వెళ్తారు” అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక భారతీయ పౌరుడిగా, జాతీయవాదిగా దేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా సభలు పెట్టుకునే హక్కు తనకు రాజ్యాంగం కల్పించిందని, దానికి ప్రాంతీయ రంగు పూసి అడ్డుకోవడం భావప్రకటన స్వేచ్ఛను కాలరాయడమేనని జనసేనాని మండిపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha