Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

వార్త 3 weeks ago

Pawan Kalyan: తాను ఒక చెరువును ఆక్రమించుకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత ఘాటుగా స్పందించారు.

ఒకవేళ ఆ ఆరోపణల్లో నిజం ఉందని నిరూపిస్తే, సదరు భూమిని లేదా ఆస్తిని తానే స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము చెరువులను కబ్జా చేశామనడం విడ్డూరంగా ఉంది, నాకేమైనా అంత ఖాళీగా ఉందా? నిజంగానే నేను అలాంటి అక్రమాలకు పాల్పడి ఉంటే ఈపాటికే నా ఇంటిని తగలబెట్టేసేవారు కదా” అంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

 Pawan Kalyan Press Meet

read also: Pawan Kalyan: ఆంధ్రాలోనే దిక్కులేదు.. తెలంగాణలో సీఎం ఎలా అవుతా?..పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డిపై గౌరవం ఉంది.. విచారణ జరపండి!

ఈ భూవివాదం అంశాన్ని తాను నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికే తీసుకెళ్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనపై ప్రత్యేక గౌరవం కూడా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “పవన్ కల్యాణ్ చెరువును ఆక్రమించాడని మీరు గనుక ఆధారాలతో నిరూపిస్తే, ఆ చెరువును ఈరోజే చాలా సంతోషంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని రేవంత్ రెడ్డికి బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు.

Pawan Kalyan: గతంలోనూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు!

రాజకీయాల్లో తనను ఎదుర్కోలేక, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేయడానికి గతంలో కూడా కొందరు రకరకాల కుట్రలు, ప్రయత్నాలు చేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ తాజా ఆరోపణలు కూడా తనపై బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని కొట్టిపారేశారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా బతికే వ్యక్తినని, ఇలాంటి తప్పుడు ప్రచారాలకు జనసేన వెనకడుగు వేయదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

raed also:

బస్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha