Sonia : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత గందరగోళం మధ్య పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరై తన వివరణ ఇచ్చారు.
తాను పార్టీ అధిష్ఠానానికి గానీ, పార్టీ విధానాలకు గానీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన కమిటీకి స్పష్టం చేశారు. ఏఐసీసీ (AICC), టీపీసీసీ (TPCC) కార్యాలయాలు తనకు పవిత్రమైన దేవాలయాలతో సమానమని, పార్టీ అగ్రనేతలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను తాను దైవ సమానులుగా భావిస్తానని ఆయన వెల్లడించారు. అధిష్ఠానాన్ని విమర్శించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని కమిటీకి విన్నవించారు.

ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల ఆవేదన మాత్రమే వెల్లడించా!
పార్టీలో చాలా కాలంగా నమ్ముకుని పనిచేస్తున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్’ నాయకులు మరియు కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఆవేదనను మాత్రమే తాను బయటపెట్టానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి ప్రాధాన్యం లభిస్తుండటంతో, ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్లకు జరుగుతున్న అన్యాయాన్ని మరియు వారి మనోభావాలను తెలియజేయడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని, పార్టీ హితం కోరి మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కమిటీని కోరినట్లు సమాచారం.
తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సెంటర్.. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ ఆహ్వానం!

