Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియా ట్రోలింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్

సోషల్ మీడియా ట్రోలింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్

వార్త 2 months ago

Margani Bharat Comments : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ ట్రోలింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్‌లా జరుగుతోందని ఆయన ఆరోపించారు.

లోకేశ్‌పై ఘాటు వ్యాఖ్యలు

నారా లోకేశ్ 'రెడ్ బుక్' పేరుతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మార్గాని భరత్ మండిపడ్డారు. జయంతి, వర్ధంతి మధ్య తేడా కూడా తెలియని నాయకుడు అంటూ లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపణ

ఫేక్ ఛానళ్ల ద్వారా జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని లోకేశ్‌కు హెచ్చరిక చేశారు.

Read Also : Kalvakuntla kavitha: అసమానతలు లేని సమాజమే బాబాసాహెబ్ ఆశయం.. కవిత

 Margani Bharat Comments

అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలు

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.2 లక్షల కోట్లు అప్పులు చేయడం అసాధ్యమని మార్గాని భరత్ పేర్కొన్నారు. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ 'మావిగన్' ప్రతిపాదన తీసుకువచ్చారని చెప్పారు.

సింగపూర్ శిక్షణపై అభ్యంతరం

మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయంపై కూడా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌తో శిక్షణ ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. గతంలో అమరావతి రైతులను సింగపూర్ తీసుకెళ్లి చివరకు గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని ఆయన ఆరోపించారు.

Read Also hindi news: https://hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బస్సు ఛార్జీలు తగ్గించిన APSRTC

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha