Crude Oil Prices Surge : పశ్చిమ ఆసియాలో రగులుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన విపణిని మళ్లీ కుదిపేస్తున్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు జరిగాయన్న వార్తలు పశ్చిమ ఆసియా నుండి చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించడంతో అక్టోబర్ 28, బుధవారం నాటి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరిగాయి.
బ్రెంట్ ముడి చమురు (Brent Crude) ధర బ్యారెల్‌కు 1.3 శాతం పెరిగి $115.36 స్థాయికి చేరుకోగా.. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 1.22 శాతం వృద్ధి చెంది బ్యారెల్‌కు $101.12 వద్ద ట్రేడవుతోంది.ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో ముడి చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని కీలక ఇంధన ప్రాసెసింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం గ్లోబల్ ఇన్వెస్టర్లు, విశ్లేషకులలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది.
Severe Cyclone 'Arnab' : 'అర్నబ్' తరువాత మరో 10 తుపాన్లు
Crude Oil Prices Surge
Crude Oil Prices Surge : రికార్డు స్థాయిలో పెరిగాయి
యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రోజుకు 5,50,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన సౌదీ అరేబియా అతిపెద్ద సౌదీ ఆరామ్‌కో ‘రాస్ తనూరా’ చమురు శుద్ధి కర్మాగారంపై తాము కచ్చితమైన క్షిపణి దాడి జరిపినట్లు వెల్లడించారు. ఈ దాడితో రిఫైనరీ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా సరీ పేర్కొన్నారు. అయితే సౌదీ అధికారులు లేదా సౌదీ ఆరామ్‌కో యాజమాన్యం ఈ దాడి పరిమాణాన్ని, ఆస్తి నష్టాన్ని వెంటనే అధికారికంగా ధృవీకరించలేదు. చమురు సరఫరాల పునరుద్ధరణ, ముందస్తు దౌత్య చర్చల కారణంగా మంగళవారం బ్యారెల్‌కు $2 వరకు తగ్గిన చమురు ధరలు, ఈ క్షిపణి దాడి వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా మళ్లీ రికార్డు గరిష్టాల వైపు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల మధ్య అమెరికాలో ముడి చమురు నిల్వలు (Crude Stocks) కూడా కొంతవరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయిటర్స్ జరిపిన నిపుణుల పోల్ ప్రకారం.. అక్టోబర్ 23తో ముగిసిన వారంలో యూఎస్ వాణిజ్య ముడి చమురు నిల్వలు సుమారు 15,000 బ్యారెళ్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

