Dailyhunt
సౌదీ యువరాజుపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

సౌదీ యువరాజుపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

వార్త 3 weeks ago

ప్రసన్నం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో నోరు పారేసుకున్నారు. ఫ్లోరిడాలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడుతూ..

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) తనను ప్రసన్నం చేసుకుంటున్నారని (Kissing my ass) వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో సౌదీ వైఖరిని ఉద్దేశించి ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Read Also: Annamayya Statue: అమెరికాలో 111 అడుగుల అన్నమయ్య మహావిగ్రహం

Donald Trump: అమెరికా శక్తిని తక్కువ అంచనా వేశారు

తమ అధ్యక్షతన అమెరికా ఇంత శక్తివంతంగా మారుతుందని సౌదీ యువరాజు ఊహించలేదని ట్రంప్ పేర్కొన్నారు. “ఏడాది క్రితం మీది చచ్చిన దేశం (Dead country), కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ కంట్రీ అని సల్మాన్ నాతో అన్నారు” అని ట్రంప్ వెల్లడించారు. తాను కూడా గత అధ్యక్షుల్లాగే బలహీనంగా ఉంటానని ఆయన అనుకున్నారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, అందుకే తనకు మర్యాద ఇవ్వాల్సి వస్తోందని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు.

వెంటనే మాట మార్చిన ట్రంప్

సంచలన వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ట్రంప్ తన స్వరాన్ని మార్చడం గమనార్హం. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను “అద్భుతమైన వ్యక్తి”, “గొప్ప యోధుడు” అని కొనియాడారు. ఇరాన్‌పై జరుగుతున్న పోరాటంలో సౌదీ అరేబియా అమెరికాకు వెన్నంటి నిలిచిందని ప్రశంసించారు. కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు.

గల్ఫ్ దేశాల మద్దతుపై ప్రశంసలు

ఇరాన్‌తో ఘర్షణ సమయంలో అమెరికాకు గల్ఫ్ దేశాలు అండగా నిలిచాయని ట్రంప్ గుర్తుచేశారు. సౌదీ అరేబియాతో పాటు ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు మనతో కలిసి పోరాడాయని ఆయన పేర్కొన్నారు. ఈ దేశాల సహకారం వల్లే అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతోందని ఆయన విశ్లేషించారు. ఒకవైపు దౌత్యపరమైన మద్దతును కోరుకుంటూనే, మరోవైపు తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం ట్రంప్‌కే చెల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha