Dailyhunt
అమెరికాలో 111 అడుగుల అన్నమయ్య మహావిగ్రహం

అమెరికాలో 111 అడుగుల అన్నమయ్య మహావిగ్రహం

వార్త 3 weeks ago

Annamayya Statue: తెలుగు సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల భక్తి పారవశ్యం ఇప్పుడు సప్తసముద్రాలు దాటి అమెరికాలో కొలువుదీరనుంది.

టెనెసీ రాష్ట్రంలోని మెంపిస్ నగరంలో ఉన్న ‘ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్’ ఆధ్వర్యంలో 111 అడుగుల ఎత్తైన అన్నమయ్య మహావిగ్రహం నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది.

Read Also:Iran President: శత్రువులకు సహకరిస్తే వదిలేది లేదు: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిక

 Annamayya Statue in USA

ప్రాజెక్ట్ విశేషాలు: రూ. 50 కోట్ల వ్యయం

సుమారు రూ. 50 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అమెరికాలోని తెలుగు ప్రజలు, భారతీయ సమాజం నుండి విశేష మద్దతు లభిస్తోంది. అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తమైన వేళ, ఆయనకు ఈ స్థాయిలో గౌరవం దక్కడం తెలుగువారందరికీ గర్వకారణంగా మారింది. సుమారు 75 టన్నుల పంచలోహంతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ ఆధునిక 3D సాంకేతికతతో దీన్ని రూపొందిస్తున్నారు. విగ్రహాన్ని ఒక్కసారిగా కాకుండా విడి భాగాలుగా తయారు చేసి, వాటిని నౌక ద్వారా అమెరికాకు తరలించే ప్రణాళిక సిద్ధమైంది. ప్రత్యేకంగా 160 టన్నుల బలమైన ఉక్కు చట్రంపై ఈ విగ్రహాన్ని అమర్చి తుది రూపం ఇవ్వనున్నారు.

Annamayya Statue: ఆవిష్కరణ తేదీ

ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన భాగాల తయారీ ప్రారంభమైంది, భారీ పాదాల నిర్మాణం పూర్తయ్యింది. వాటి పరిమాణం చూసినవారికి ఈ విగ్రహ వైభవం ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ప్రణాళిక ప్రకారం 2028 మే 9న అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ మహావిగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మెంపిస్ నగరం భారతీయ భక్తి సంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha