AP Woman Suicide: తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి చెందిన కోనేటి మమత (36), బుధవారం సౌదీలోని జుబేల్‌లో తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ధృవీకరించారు.
మమతకు తిరుపతికి చెందిన కోనేటి కృష్ణతో గతంలో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కొంతకాలం వీరు శ్రీకాళహస్తిలో నివాసం ఉన్నారు. కృష్ణకు సౌదీ అరేబియాలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో, దంపతులు ఇద్దరూ కలిసి జుబేల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
Read Also : Delhi Crime: దిల్లీలో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం
Tragedy in Jubail: Telugu woman commits suicide by hanging herself.
AP Woman Suicide: ఆత్మహత్యకు గల కారణాలు
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. తిరుపతిలోని కుటుంబ ఆస్తుల వివాదం కారణంగా గత కొంతకాలంగా మమత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆస్తులకు సంబంధించిన గొడవలు మానసికంగా ఆమెను కుంగదీశాయి. ఈ క్రమంలోనే బుధవారం భర్త ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. సౌదీలో జరిగిన ఈ ఘోర వార్త విన్న మమత తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

