Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సౌదీపై దాడులు వెంటనే ఆపాలి' అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక

'సౌదీపై దాడులు వెంటనే ఆపాలి' అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక

వార్త 1 week ago

Saudi Arabia Attacks: సౌదీ అరేబియాలోని పౌర మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న వరుస దాడులపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ దాడులను “పూర్తిగా ఆమోదయోగ్యం కానివి”గా అభివర్ణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఇటువంటి చర్యలు తక్షణమే ఆగిపోవాలని డిమాండ్ చేసింది. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారత ప్రవాసుల భద్రతపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక భారత పౌరుడు అక్టోబర్ 11న చికిత్స పొందుతూ మరణించారని ఆయన ధృవీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల కోరిక మేరకు భారత రాయబార కార్యాలయం సహాయంతో సౌదీ రాజధానిలోనే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల నోటీసులు? అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశాలు!

 Saudi Arabia Attacks

Saudi Arabia Attacks : అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్నారు

ఈ దాడుల్లో గాయపడిన మొత్తం 11 మంది భారతీయులలో ముగ్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు బాధితులను, వారి కుటుంబాలను క్రమం తప్పకుండా పరామర్శిస్తూ అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్నారు. సౌదీ రాజధాని రియాద్ వైపు హౌతీలు ప్రయోగించిన క్రూయిజ్/బాలిస్టిక్ క్షిపణులను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి.

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. సముద్రంలో మునిగిన సింగపూర్ నౌక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha