Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పైడర్ మ్యాన్ - బ్రాండ్ న్యూ డే ప్రీమియర్‌లో అల్లు అర్జున్ సందడి..!

స్పైడర్ మ్యాన్ - బ్రాండ్ న్యూ డే ప్రీమియర్‌లో అల్లు అర్జున్ సందడి..!

వార్త 1 week ago

Allu Arjun : మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అల్లు సినిమాస్ లో ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు.

అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు :

అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఫ్యాన్స్, సెల్ఫీలు, వీడియోల కోసం ఆసక్తి చూపించారు. కుటుంబంతో కలిసి సినిమా వీక్షించిన అల్లు అర్జున్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్పైడర్ మ్యాన్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్, ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నో వే హోమ్ లో మూడు తరాల స్పైడర్ మ్యాన్‌లు ఒకే తెరపై కనిపించడం అభిమానులకు మరపురాని అనుభూతిని ఇచ్చింది.

ఇప్పుడు స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే కూడా అదే స్థాయిలో అంచనాలను సొంతం చేసుకుంది. యాక్షన్, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై భారీ ఆసక్తి కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తుండగా, విడుదల రోజున అనేక చోట్ల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి ప్రీమియర్‌కు హాజరుకావడం సినిమాపై మరింత చర్చకు దారితీసింది. దీంతో సోషల్ మీడియాలో స్పైడర్ మ్యాన్ అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ సినిమాపై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వ్యాయామంతో ప్రీడయాబెటిస్‌ను జయించవచ్చా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha