Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యాయామంతో ప్రీడయాబెటిస్‌ను జయించవచ్చా..?

వ్యాయామంతో ప్రీడయాబెటిస్‌ను జయించవచ్చా..?

వార్త 1 week ago

Prediabetes : టైప్-2 డయాబెటిస్‌కు ముందు వచ్చే దశను ప్రీడయాబెటిస్ అంటారు. ఈ దశలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, డయాబెటిస్‌గా నిర్ధారణ అయ్యేంత స్థాయిలో ఉండవు.

అయితే ఈ దశను నిర్లక్ష్యం చేస్తే కొన్నేళ్లలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే సరైన జీవనశైలి, ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ప్రీడయాబెటిస్‌ (Prediabetes)ను అదుపులో ఉంచడంతో పాటు, చాలా సందర్భాల్లో సాధారణ స్థితికి తీసుకురావచ్చని వైద్య నిపుణులు చెబుతున్ నారు.

ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు :

ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడక, సైక్లింగ్, జాగింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకోగలవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. వారానికి రెండు లేదా మూడు రోజులు తేలికపాటి బలం పెంచే వ్యాయామాలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు అవసరం. మిల్లెట్స్, గోధుమలు, ఓట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, జంక్ ఫుడ్, అధిక నూనెతో చేసిన పదార్థాలను తగ్గించడం మంచిది. శరీర బరువును నియంత్రణలో ఉంచడం కూడా ప్రీడయాబెటిస్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అలాగే సరిపడా నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించడం, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం కూడా అవసరం. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రీడయాబెటిస్ అనేది శాశ్వత వ్యాధి కాదని, అది ఒక హెచ్చరిక సంకేతమని గుర్తుంచుకోవాలి. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి, వ్యాయామం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మెట్రోలో సీఎం విజయ్.. ఫ్యాన్స్ హ్యాపీ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha