Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'స్పిరిట్'లో క్రేజీ యాక్షన్?

'స్పిరిట్'లో క్రేజీ యాక్షన్?

వార్త 4 months ago

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit) షూటింగ్ అప్‌డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీన్ ఇండియన్ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని విధంగా, నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని సమాచారం. కథ ప్రకారం అత్యంత కీలకమైన ఈ ఇంటర్వెల్ ఫైట్‌లో ప్రభాస్ ఏకంగా వంద మంది ప్రొఫెషనల్ ఫైటర్స్‌తో ఒంటరిగా తలపడనున్నారట. ఈ వంద మంది ఫైటర్స్ కూడా కేవలం లోకల్ గ్రూప్ కాకుండా, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయికి చెందిన స్టంట్ మాస్టర్స్ కావడం విశేషం.

 Spirit Movie updates

సందీప్ వంగా సరికొత్త ప్లాన్.. త్వరలోనే భారీ యాక్షన్ షెడ్యూల్!

సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్‌ను అత్యంత వైల్డ్‌గా చూపించడంలో సిద్ధహస్తుడైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఈ ఇంటర్వెల్ బ్లాక్‌ను ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇచ్చేలా చాలా విభిన్నంగా డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా, ఆయనలోని మాస్ మరియు రగ్గడ్ లుక్‌ను ఎలివేట్ చేసేలా ఈ స్టంట్స్ సాగుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ కూడా వేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ క్రేజీ ఫైట్ సీన్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లడం ఖాయమని, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై చెలరేగిన వివాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha