Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై చెలరేగిన వివాదం

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై చెలరేగిన వివాదం

వార్త 4 months ago

Jr NTR Trivikram Movie Controversy: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ చుట్టూ ఇప్పుడే వివాదం రాజుకుంది.

ఈ చిత్రం ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కక ముందే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తమిళుల ఇష్టదైవమైన మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) చారిత్రక నేపథ్యాన్ని సినిమాలో తప్పుగా చూపిస్తున్నారంటూ తమిళనాడుకు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ అధినేత, ప్రముఖ దర్శకుడు సీమాన్ (Seeman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also:VenkyAnil5 Movie Poster:వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ క్రేజీ పోస్టర్ అవుట్

Jr NTR Trivikram Movie Controversy:తమిళుల మనోభావాలను కించపరుస్తున్నారు – సీమాన్ ఆగ్రహం

ఈ ప్రాజెక్టు కథాంశానికి సంబంధించిన కొన్ని అంశాలపై సీమాన్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్రబృందానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమిళ సంస్కృతి, చరిత్రలో భాగమైన సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) ను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. తమిళుల దైవమైన సుబ్రహ్మణ్య స్వామిని ఈ సినిమాలో ఉత్తరాంధ్ర దైవంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ తమిళుల మనోభావాలను, వారి సంస్కృతిని కించపరచడమేనని సీమాన్ ఆరోపించారు. చారిత్రక అంశాలను, దైవ స్వరూపాలను సినిమా అవసరాల కోసం మార్చకూడదని, ఒకవేళ ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయకుండా లేదా ప్రాజెక్టును నిలిపివేయకుండా ముందుకు వెళ్తే తమిళనాడు వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు ఉన్న తరుణంలో, ఈ తాజా వివాదం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ లేదా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Epaper: epaper.vaartha.com

ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన 'మా ఇంటి బంగారం'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha