SRH Vs RR : ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై విరుచుకుపడ్డారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ హైదరాబాద్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో టోర్నమెంట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, అతడి విధ్వంసక బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ (50) అర్ధసెంచరీతో రాణించగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29), రియాన్ పరాగ్ (26) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ బోర్డుపై కొండంత స్కోరును ఉంచగలిగింది.
Read Also ; IPL 2026 క్వాలిఫయర్-1 లో ఊహించని వివాదం.. !!

చేతులుెత్తేసిన కమిన్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దారుణ వైఫల్యం!
ఈ కీలకమైన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లైన్అప్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన కమిన్స్ ఏకంగా 16 ఎకానమీ రేట్‌తో 64 పరుగులు సమర్పించుకోవడం సన్‌రైజర్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే ఒక్కడే అంతో ఇంతో రాణించి 3 వికెట్లు పడగొట్టగా, శివాంగ్, మలింగా, మరియు నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు. క్వాలిఫైయర్-2కు అర్హత సాధించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఇప్పుడు 244 పరుగుల సుదీర్ఘ హిమాలయ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

