Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026 క్వాలిఫయర్-1 లో ఊహించని వివాదం.. !!

IPL 2026 క్వాలిఫయర్-1 లో ఊహించని వివాదం.. !!

వార్త 3 months ago

Unexpected Controversy : ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో తీవ్ర వివాదానికి దారి తీసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో నిర్వాహకులు దాదాపు 25 నిమిషాల పాటు భారీ సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేశారు.

అయితే, ఐపీఎల్ ట్రోఫీపై లేజర్ లైట్లతో ప్రదర్శించిన భారతదేశ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన కీలక ప్రాంతాలు అసంపూర్తిగా, అసమగ్రంగా కనిపించాయి. దేశ సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచే జాతీయ మ్యాప్‌ను ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రదర్శించడంపై మైదానంలోని ప్రేక్షకులు, టీవీల్లో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దావానంలా వ్యాపించాయి.

Read Also : సరికొత్త రికార్డు సృష్టించిన రబాడ

నెటిజన్ల ఆగ్రహం

ఈ తీవ్రమైన పొరపాటుపై నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, ప్రతిష్టాత్మకమైన క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తూ, కనీసం దేశ మ్యాప్‌ను కూడా సరిగ్గా ప్రదర్శించలేరా అంటూ బీసీసీఐ (BCCI) మరియు ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తున్నారు. “ఇది కేవలం ఒక చిన్న సాంకేతిక లేదా గ్రాఫిక్స్ పొరపాటు కాదు, దేశ గౌరవానికి సంబంధించిన తీవ్రమైన విషయం” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ మన అంతర్భాగాలైన జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలను మ్యాప్‌లో చూపించకపోవడం ఏంటని, బాధ్యులైన ప్రొడక్షన్ టీమ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రధానమంత్రి కార్యాలయాన్ని (PMO), దేశ పెద్దలను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నేటి నుంచి ప్లేఆఫ్స్ సమరం.. మోస్ట్ సక్సెస్ టీమ్స్ ఇవే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha