Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SRHకు బిగ్ షాక్.. ఐపీఎల్-2027కు పాట్ కమ్మిన్స్ దూరం?

SRHకు బిగ్ షాక్.. ఐపీఎల్-2027కు పాట్ కమ్మిన్స్ దూరం?

వార్త 2 months ago

Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఒక దిగ్భ్రాంతికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్, ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వచ్చే ఏడాది 2027 ఐపీఎల్ (IPL) సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు, దేశీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కోసమే తాను ఐపీఎల్-2027కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ ఇప్పటికే పరోక్షంగా సూచించాడు.

Read also: ENG vs NZ: తొలి టెస్టుకు ఇంగ్లాండ్ 12 మంది జట్టు ఖరారు

 Big shock for SRH.. Pat Cummins out of IPL-2027?

Pat Cummins: మెగా టోర్నీలపైనే కమిన్స్ నజర్

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత కీలకమైన సీజన్ కానుంది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌తో పాటు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్, అలాగే వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు వరుసగా ఉన్నాయి. ఈ ప్రధాన టోర్నీలన్నింటిలోనూ తాను పూర్తిగా ఫిట్‌గా ఉంటూ, జట్టును నడిపించాలనే లక్ష్యంతోనే కమిన్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నిరంతర క్రికెట్ ఆడటం వల్ల వచ్చే అలసట, గాయాల బారిన పడకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

ఒకవేళ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు అందుబాటులో లేకపోతే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కమిన్స్ స్థానంలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ నాయకత్వ బాధ్యతలు చేపడితే జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్ మూలాలున్న ముగ్గురు ఆటగాళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha