Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని!

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని!

వార్త 1 month ago

Free Petrol in Tirupati: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను వేధిస్తోంది. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో తిరుపతికి చెందిన ఒక పెట్రోల్ బంక్ యజమాని చూపిన ఉదారత ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read Also:Anantapur: బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Free Petrol in Tirupati: కొరత వేళ.. కొండంత అండ

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షలు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉండగా, తిరుపతి రూరల్ తనపల్లి దగ్గరున్న IOCL బంక్ యజమాని రొమ్మల రాజేష్ రెడ్డి సామాన్యులకు అండగా నిలిచారు.బంక్ వద్ద క్యూ లైన్లలో నిలబడిన జనాన్ని చూసి చలించిపోయిన ఆయన, ఒక్కొక్కరికి లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు 5 వేల మందికి పైగా వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందించారు.తన బంకులో ఉన్న లోడ్ (స్టాక్) పూర్తయ్యే వరకు ఈ ఉచిత పంపిణీ కొనసాగుతుందని, ఒకవేళ కొత్త లోడ్ వస్తే మళ్ళీ ఉచితంగానే ఇస్తామని ఆయన ప్రకటించడం విశేషం.

 AP Petrol Shortage Update

నీటి సీసాల సరఫరా.. సేవా దృక్పథం

కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా, ఈ భయంకరమైన ఎండల్లో క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడుతున్న ప్రజల కోసం రాజేష్ రెడ్డి ఉచితంగా పెట్రోల్ సరఫరా చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు, స్థానికుల కష్టాలు చూడలేక తనవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజేష్ రెడ్డి గతంలో కూడా తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి స్థానికుల మన్ననలు పొందారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం: రంగంలోకి సీఎం చంద్రబాబు, కఠిన ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha