Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టార్ హీరోలు అందుకే భయపడతారు.. ఇండస్ట్రీపై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరోలు అందుకే భయపడతారు.. ఇండస్ట్రీపై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

వార్త 2 months ago

JD Chakravarthy: ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో వెలుగుల వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టారు.

ముఖ్యంగా సినిమా రంగంలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులు, అగ్ర హీరోల మనస్తత్వాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Read Also: Citadel Season 2: సిటాడెల్ సీజన్ 2.. ట్రైలర్ వచ్చేసింది

 JD Chakravarthy Shocking Comments on the industry

JD Chakravarthy: జేడీ వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు

ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న వారు సైతం తమ కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే ఎందుకు భయపడతారో జేడీ సూటిగా చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఆడపిల్లల పట్ల చూపే ధోరణి తెలిసిన వారు కాబట్టే తల్లిదండ్రులుగా వారు ఆ నిర్ణయం తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇతర భాషల నటీమణులకు ఇచ్చే ప్రాధాన్యత మన తెలుగు అమ్మాయిలకు దక్కడం లేదని,

ప్రతిభ ఉన్నా కొన్ని అలిఖిత నిబంధనలు వారిని అడ్డుకుంటున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా తన భర్త తమ కుమార్తెను సినిమాల్లోకి పంపడానికి ఇష్టపడలేదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న ఈ ‘డార్క్ సైడ్’ గురించి జేడీ ఇంత ధైర్యంగా మాట్లాడటంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబైలో సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమా గ్రాండ్ లాంచ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha