Jharkhand Tragedy: ఝార్ఖండ్‌లో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వ్యక్తికి సహాయం చేసేందుకు వచ్చిన గ్రామస్థులపైకి మృత్యురూపంలో భారీ ట్రక్కు దూసుకొచ్చింది.
ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి కుంతి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణాల వ్యవధిలో ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో అతడు రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడికి సహాయం చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది యువకులు పొదల్లో పడిపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు మహిళలు, చిన్నారులు రోడ్డు పక్కన నిలబడి అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అంతలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.
US Car Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరు యువకుడు మృతి
Jharkhand Tragedy
అదుపుతప్పి జనాలపైకి దూసుకొచ్చిన 18 చక్రాల ట్రక్కు
అదే సమయంలో తోర్ప వైపు నుంచి అత్యంత వేగంగా వచ్చిన 18 చక్రాల భారీ ట్రక్కు రోడ్డు పక్కన గుమిగూడిన గ్రామస్థులపైకి దూసుకొచ్చింది. భారీ వాహనం వేగంగా రావడంతో అక్కడున్న వారికి తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు. ట్రక్కు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడగా, ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. బాధితుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Jharkhand Tragedy : ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.. తీరని విషాదం
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం మరింత విషాదాన్ని నింపింది. బిర్సా నాయక్ కుటుంబానికి చెందిన ఆయన భార్య కసిలా దేవి, కుమార్తె అంజలి కుమారి, ఏడాది వయసున్న మనవడు సౌరభ్ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన మిగిలిన వారిని మండు దేవి, పాకో దేవి, తుతి కుమారి, గోలు కుమార్‌గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఏడాది చిన్నారి మరణం స్థానికులను కలచివేసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కుంతి జిల్లా ఎస్పీ రిషభ్ గార్గ్ రాత్రి వేళ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, హృదయవిదారకమని పేర్కొన్నారు. కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. రహదారిపై ఉన్న మలుపు, రాత్రి సమయంలో చీకటి వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒకరిని కుంతి సదర్ ఆసుపత్రికి, మరొకరిని తోర్ప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Epaper: epaper.vaartha.com
భార్యతో సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్.. అసలేం జరిగింది?

