Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థిరంగా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్థిరంగా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

వార్త 2 weeks ago

Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు పెద్దగా మార్పులు లేకుండా సాదాసీదాగా మొదలయ్యాయి. నిఫ్టీ సుమారు 17 పాయింట్ల స్వల్ప లాభంతో 24,348 దగ్గర ట్రేడ్ అవుతోంది.

సెన్సెక్స్ కూడా 18 పాయింట్లు పెరిగి 77,974 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతానికి మార్కెట్లో పెద్దగా ఒడిదుడుకులు కనిపించడం లేదు.

Read also: Stock market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

 Live stock market trading chart update

Stock market: అంతర్జాతీయ మార్కెట్ల తాజా పరిస్థితి

అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. ఎస్ అండ్ పీ 1.46 శాతం పెరగగా, నాస్‌డాక్ 2.02 శాతం లాభపడింది. అయితే మన దగ్గర డాలర్ ఇండెక్స్ 97.98 వద్ద ఉంది. బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరడం వల్ల ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 102.01 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాల ఆధారంగా ట్రేడింగ్ సాగుతోంది. మదుపర్లు ఆచితూచి అడుగులు వేయడం వల్ల మార్కెట్ ఫ్లాట్‌గా ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha