National Award Controversy:ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (72nd National Film Awards) టాలీవుడ్ సంచలనం సృష్టించింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన టాలీవుడ్ క్రేజీ సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే (Best Screenplay) రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
అయితే, ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ అవార్డు ఎంపికపై సినీ విమర్శకులు, మేధావుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also:72nd National Film Awards: పృథ్వీరాజ్ కు అన్యాయం?

డైరెక్టర్ సుకుమార్ రాసుకున్న గ్రిప్పింగ్ కమర్షియల్ స్క్రీన్‌ప్లేకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంపై అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అవార్డుల జూరీ తీసుకున్న నిర్ణయంపై చిత్ర పరిశ్రమలోని కొందరు మేధావులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ‘పుష్ప 2’ అనేది ఒక పక్కా మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఇలాంటి రొటీన్ ఫార్ములా కథనానికి అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఎలా ఇస్తారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసిన పెద్ద సినిమాలను, స్టార్ హీరోల క్రేజ్‌ను చూసి అవార్డులు ఇచ్చుకుంటూ పోతే.. కంటెంట్ నమ్ముకునే చిత్రాలకు న్యాయం ఎలా జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది.
National Award Controversy:’క’ సినిమాను కాదని ‘పుష్ప 2’కా? చిన్న సినిమాల గోడు
ఈ వివాదంలో ప్రధానంగా గతేడాది టాలీవుడ్‌లో విలక్షణమైన కాన్సెప్ట్‌తో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘క’ (KA) సినిమా స్క్రీన్‌ప్లే ప్రస్తావనకు వస్తోంది. టైమ్ ట్రావెల్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులు ఊహించని విధంగా క్లైమాక్స్ ట్విస్ట్‌తో సాగే ‘క’ సినిమా స్క్రీన్‌ప్లే అత్యంత అద్భుతంగా ఉందని సినీ ప్రియులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిన్న చిత్రాల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సింది పోయి, జూరీ వాటిని విస్మరించిందని ఆరోపిస్తున్నారు. జాతీయ అవార్డుల అసలు ఉద్దేశం కళాత్మక విలువలు, సరికొత్త ప్రయోగాలు చేసే చిన్న సినిమాలను ఆదుకోవడం మరియు ప్రోత్సహించడమేనని, కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే కేవలం కమర్షియల్ సక్సెస్ చుట్టూనే అవార్డులు తిరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

