Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ, దీనిని తాను ఎదురుదెబ్బగా భావించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
ప్రస్తుత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల పరిస్థితి ఎలా ఉందో ఈ ఉదంతం ద్వారా ప్రజలందరికీ అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై తనకు పూర్తి గౌరవం ఉందని, అందువల్ల న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తానేమీ మాట్లాడబోనని పేర్కొన్నారు.
supreme court verdict
read also:DK Aruna: మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: డీకే అరుణ
న్యాయపోరాటంలో వెనకడుగు వేసేది లేదు
ఈ తాజా పరిణామాలు తనను ఏమాత్రం ఆశ్చర్యానికి లేదా షాక్‌కు గురిచేయలేదని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం (EC) వ్యవహరిస్తున్న శైలిపై తమకు నమ్మకం లేనప్పటికీ, తమ వైపు ఉన్న న్యాయపరమైన వాదనలు అత్యంత బలంగా ఉన్నాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Meenakshi Natarajan: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి (RO) తిరస్కరించారు. దీనిని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎస్. చందూర్‌కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలై కొనసాగుతున్న తరుణంలో న్యాయస్థానాలు మధ్యలో జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ‘ఎలక్షన్ పిటిషన్’ ద్వారానే చట్టపరమైన పరిష్కారం వెతుక్కోవాలని కోర్టు సూచించింది.
అసలు వివాదం ఏమిటి?
గతంలో (2022లో) తెలంగాణలో నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని బీజేపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూన్ 9న రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను చెల్లదంటూ తిరస్కరించారు. అయితే, చట్టప్రకారం రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉండి, కోర్టులు చార్జ్ ఫ్రేమ్ చేసిన కేసుల వివరాలనే అఫిడవిట్‌లో రాయాల్సి ఉంటుందని.. కానీ ఈ కేసులో ఆమెకు కేవలం కోర్టు సమన్లు మాత్రమే వచ్చాయని మీనాక్షి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

