Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టును ఆశ్రయించను: దానం నాగేందర్ కీలక ప్రకటన

సుప్రీంకోర్టును ఆశ్రయించను: దానం నాగేందర్ కీలక ప్రకటన

వార్త 2 weeks ago

Danam Nagender: తన అనర్హతకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాను పూర్తిగా గౌరవిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు.

రాజకీయంగానే తేల్చుకుంటాం: ప్రజాక్షేత్రమే నా బలం

ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ రాజకీయ పోరాటంపై పూర్తి స్పష్టతనిచ్చారు. “ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కొత్తేమీ కాదు, అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. న్యాయపరమైన పోరాటాలకంటే ప్రజల మద్దతుతోనే రాజకీయంగా ముందుకు వెళ్తానని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు.

Danam Nagender: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి పరిణామాలు

గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ, నాగేందర్ మాత్రం న్యాయపోరాటానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎర్రవల్లి సరిహద్దు భూముల్లో రెండో రోజు సర్వే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha