KCR Farm House : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వరుసగా రెండో రోజు సర్వే నిర్వహించారు.
ఎర్రవల్లితో పాటు దాని శివారు గ్రామాలైన వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న 388 ఎకరాల విస్తీర్ణంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు ప్రాథమికంగా సరిహద్దులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు, ప్రస్తుతం గతంలో ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రెవెన్యూ రికార్డులను సేకరిస్తూ సమగ్ర నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు.
El Niño : ఫస్ట్ ప్రయారిటీ దానికే.. తర్వాతే వ్యవసాయానికి - ఉత్తమ్
KCR Farm House
KCR Farm House : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – 30 రోజుల గడువు
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆధారంగా ఈ విచారణ వేగవంతమైంది. ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. శాసనసభలో 22A నిబంధనపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి చెందిన భూమి వివరాలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, అక్కడ దాదాపు 700 ఎకరాల విస్తీర్ణం ఉందో లేదో తేల్చాలని స్పష్టం చేశారు. సర్వే నంబర్ 325 లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ (అసైన్డ్) భూమికి సంబంధించిన వివరాలను కేసీఆర్ గతంలో వెల్లడించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫామ్‌హౌస్ పరిధిలో ఏవైనా ప్రభుత్వ భూములు లేదా అక్రమాలు తేలితే, వాటిని స్వాధీనం చేసుకుని దళితులకు పట్టాలుగా పంపిణీ చేస్తామని, వారిని యజమానులుగా మారుస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా గత ప్రభుత్వంలో దాదాపు రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం ఆరోపించారు. దీనిపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SET) ద్వారా విచారణ జరిపి దోపిడీని బయటపెడతామన్నారు. ఇది కేవలం ‘ధరణి పార్ట్-1’ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ‘పార్ట్-2’ పేరిట మరిన్ని అక్రమాలను మరియు TGIIC భూముల కేటాయింపుల్లో జరిగిన పొరపాట్లను బడ్జెట్ సమావేశాల్లో బహిర్గతం చేస్తామని ప్రకటించారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

