Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూరత్‌లో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ. 50 లక్షలతో పరారైన దుండగులు!

సూరత్‌లో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ. 50 లక్షలతో పరారైన దుండగులు!

వార్త 1 month ago

Surat SBI Bank Robbery: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో దుండగులు బరితెగించారు. వరాచా ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో పట్టపగలే సాయుధ దోపిడీకి పాల్పడ్డారు.

పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న బ్యాంకులోకి తుపాకులతో ప్రవేశించిన దుండగులు సిబ్బందిని, ఖాతాదారులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ. 50 లక్షల నగదును దోచుకెళ్లారు.

Read Also : Hyderabad Crime: హైదరాబాద్‌లో అమానుషం.. వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం

పక్కా ప్లాన్‌తో దోపిడీ

ఈ దోపిడీలో దుండగులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. బ్యాంకులోకి ప్రవేశించగానే ఎవరూ పోలీసులకు సమాచారం అందించకుండా ఉండేందుకు మొదట అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించి, క్యాష్ కౌంటర్, లాకర్‌లోని నగదును బ్యాగుల్లో నింపుకుని నిమిషాల వ్యవధిలోనే పరారయ్యారు.

రంగంలోకి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన

ఈ ఘటనతో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి దుండగుల కోసం గాలిస్తున్నారు. నగరవ్యాప్తంగా నాకాబంధీ నిర్వహించి అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బ్యాంకు భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్.. హైకోర్టు పెట్టిన షరతులు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha