Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి

సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి

వార్త 1 week ago

Surat gas leak: గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని అశ్విని కుమార్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక ఆభరణాల తయారీ సంస్థలో జరిగిన సూరత్ విషవాయువు లీక్ ఘటన నలుగురు కార్మికుల ప్రాణాలను బలిగొంది.

శుద్ధి ప్లాంట్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషవాయువు పీల్చడంతో కార్మికులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

Read also: Gir forest Lion cubs death: గిర్ అడవుల్లో ఎనిమిది సింహం పిల్లల మృతిపై గుజరాత్ మంత్రి క్లారిటీ

 Four workers die due to toxic gas leak.

ట్యాంక్ లో పేరుకుపోయిన అధిక విషవాయువుల సాంద్రత

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్యాంక్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కార్మికులు మరణించినట్లు వెల్లడించారు. ట్యాంక్ లో పేరుకుపోయిన అధిక విషవాయువుల సాంద్రత వల్లే వారు ఊపిరి ఆడక చనిపోయారని ప్రాథమికంగా గుర్తించారు.

Surat gas leak: ఊపిరి ఆడక చనిపోయారని

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఆభరణాల సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో కార్మికులకు కనీస రక్షణ పరికరాలు అందించారా లేదా అని ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha