Jagadish Reddy: కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖను తమ పార్టీలోకి తీసుకునే ఆలోచనే లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఆమెను తెలంగాణ భవన్ గేటు కూడా దాటనివ్వమని ఆయన స్పష్టం చేశారు.
సురేఖను పార్టీలో చేర్చుకోవడానికి తమ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని స్పష్టతనిచ్చారు.

గతంలో పార్టీ మారిన వారిపై జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
గతంలో బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారిన నేతల పునఃప్రవేశంపై కూడా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. అప్పట్లో పార్టీని వీడి వెళ్లిన వారిలో కేవలం ఒకరిద్దరిని మినహాయిస్తే, మిగతా ఎవరినీ తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండే వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
Jagadish Reddy: బీఆర్‌ఎస్‌లోకి రానున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జగదీశ్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందని, అందుకే చాలా మంది నేతలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

