Suriya Karuppu Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కరుప్పు' (Karuppu) సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. త్వరలోనే చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Read Also:Jana Nayagan Movie Release: మే 27న 'జన నాయకన్' విడుదల? సీఎం హోదాలో థియేటర్లకు రాబోతున్న విజయ్!
కథా నేపథ్యం: చట్టం.. దైవం.. న్యాయం
ఈ సినిమాలో సూర్య 'సరవణన్' అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. సామాన్యులకు చట్టం ద్వారా న్యాయం దక్కని క్లిష్ట పరిస్థితుల్లో, హీరోలో 'కరుప్పస్వామి' దేవుడు ఆవహించి దుష్టశిక్షణ చేస్తాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మాస్ ఎలిమెంట్స్, హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ ,అదిరిపోయే డ్యాన్స్‌లతో ఈ చిత్రాన్ని ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.
Veerabhadrudu Telugu Movie Suriya
Suriya Karuppu Movie: భారీ తారాగణం.. తెలుగులో 'వీరభద్రుడు'
ఈ చిత్రంలో యోగి బాబు, ఇంద్రన్స్, శివదా, స్వాసిక, నట్టి, సుప్రీత్ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో 'కరుప్పు'గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో 'వీరభద్రుడు' అనే పేరుతో విడుదల చేయనున్నారు. సెన్సార్ పూర్తి కావడంతో ఇక నుండి చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేయనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్: బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ 'ఏక్ దిన్'

