Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రావిస్ హెడ్ భార్యపై దాడులు చేస్తామంటూ సైబర్ వేధింపులు!

ట్రావిస్ హెడ్ భార్యపై దాడులు చేస్తామంటూ సైబర్ వేధింపులు!

వార్త 3 weeks ago

Travis Head Wife Online Threats: ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే స్లెడ్జింగ్, వివాదాలు లీగ్ ముగిసినా సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి.

ఇటీవల ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హిట్టర్ ట్రావిస్ హెడ్ మధ్య చోటుచేసుకున్న మైదాన ఉద్రిక్తతలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ వివాదం నేపథ్యంలో ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్‌ (Jessica Head) కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తుండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also :IPL 2026: ఫిట్‌గా లేకపోయినా ఆడాను.. రియాన్ పరాగ్!

Travis Head Wife Online Threats:మైదానంలో గొడవ.. సోషల్ మీడియాలో వికృతరూపం

 Cricket Fans Online Troll Threats

ఈ విషయాలపై జెస్సికా హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో జరిగిన ఒక సాధారణ మ్యాచ్ వివాదాన్ని మనసులో పెట్టుకుని, సోషల్ మీడియా వేదికగా కొంతమంది సైబర్ వేధింపులకు దిగుతున్నారని ఆమె వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను, మిత్రులను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా.. ఏకంగా తమపై దాడులకు పాల్పడతామంటూ కొందరు నెటిజన్లు ఇన్‍బాక్స్‌లో మెసేజ్‌లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె పేర్కొన్నారు. మైదానంలో ఆటను ఆటలాగే చూడాలని, అంతేకాని ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను ఇందులోకి లాగడం సరికాదని ఆమె హితవు పలికారు.

మాకూ కుటుంబాలు ఉంటాయి, గౌరవించండి: జెస్సికా హెడ్!

క్రీడాకారులకు కూడా సాధారణ వ్యక్తుల్లాగే కుటుంబాలు, పర్సనల్ లైఫ్ ఉంటాయని, వారిని కూడా గౌరవించడం నేర్చుకోవాలని జెస్సికా ఈ సందర్భంగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా పలువురు విదేశీ ఆటగాళ్ల భార్యలు ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొన్న ఉదంతాలు ఉండగా.. తాజా ఘటన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్యాన్ వార్స్ ఎంతటి వికృత రూపం దాల్చుతున్నాయో అద్దం పడుతోంది. క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమేనని, క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించే ఇలాంటి సైకో నెటిజన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హార్దిక్ కెప్టెన్సీపై పొలార్డ్ కామెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha