Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వాగతించదగినది

స్వాగతించదగినది

వార్త 1 week ago

Telangana High Court : ఎప్పుడు గెలిచినా, ఎక్కడ గెలిచినా, ఎలా గెలిచినా రాజకీయాల్లో అలవాటు పడిన నేతలు ఎప్పుడూ అధికార పార్టీతోనే ఉండాలనుకునే రోజులు నడుస్తున్నా యి.

అందుకే ఇప్పుడు ఏ రాజకీయ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. అధికారంలో ఉండి పక్కచూపులు చూసేవారి మీద, ఇతర పార్టీల్లోకి మారే వారికి రాజ్యాంగం ప్రసాదించిన నియమ నిబంధనలు ఉండనే ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్ట యినా పాత నిబంధనలు వర్తింప చేయడానికి చట్ట సభలు, న్యాయస్థానాలు నానా యాతన పడ్తుంటాయి. ఫిరాయింపులను నిరుత్సాహపరిచేందుకు పలు చట్టాలు ఉన్నా పలు పార్టీలు రాజకీయాల్లో ఇలాంటివన్నీ మా మూలే కదా! అని సరిపెట్టుకునే వారు లేకపోలేదు. కానీ బయట పార్టీలో ఎన్నికై అధికార పార్టీతో అంటకాగే వారికి కొన్ని విధాలుగా మేలు కలుగచ్చు కానీ రాజ్యాంగం మాత్రం అట్టివారిని ఉపేక్షించదని తాజా తీర్పు ఒకటి చెప్తోంది. తెలంగాణలోని ఖైరతాబాద్ నియోజక వర్గ శాసనసభ్యుడు దానం నాగేందర్ను తెలంగాణ హైకోర్టు ఆయన శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రక టించింది. రెండో అవకాశమేదీలేకుండా ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయినట్లు ప్రకటిం చింది కూడా.

 High Court

Telangana High Court : ప్రజాస్వామ్యాన్ని అవమానించడ మేనని

ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడకుండా పార్టీ ఫిరాయించారన్న నిర్ధారణ అయిన ఎ మ్మెల్యేపై వేటు వేసిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు స్వాగతించదగినవి. ఇలాంటి సంచలన నిర్ణయం తీసు కున్న ధర్మాసనం రాజ్యాంగాన్ని పరిక్షించిందని అందరూ అనుకుంటున్నమాట. బిఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద గెలిచాడంటేనే ఆ పార్టీని ఆదరించి ప్రజలు ఓటేసారని చెప్పుకోవాలి. అలా గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరి అదేదో ప్రజాప్రయోజ నానికో, అధికారపార్టీలో ఉంటే తమ ప్రాంత సమస్యలు తీర్చేందుకు అయి ఉంటుందని సరిపెట్టుకుంటారు. కానీ మరుసటి పార్లమెంటు ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచాడంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడ మేనని ప్రజాస్వామ్యవాదులంతా ఎలుగెత్తి ఖండిం చారు. ఇలా పార్టీ మార్చి పోటీలో ఉన్న ఉదంతాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ఆ కారణం చేతనే తమకున్న విశిష్ట అధికారాలతో ధర్మాసనం న్యాయమూర్తులు ‘స్పీకరు ఉత్తర్వులను రద్దు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), రెడ్్వత్ పదవ షెడ్యూల్లోని పేరా 2(1) ఎ ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి దానం ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హుడని తేల్చారు. ఎమ్మెల్యే పార్టీ మారడాన్ని పరిగణించకుండా స్పీకరు ఇచ్చిన ఉత్తర్వులనురద్దు చేస్తూ రిట్పిటిషన్లను ధర్మాసనం అనుమతించింది.

ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం.

తెలం గాణ రాష్ట్ర చరిత్రలోనే బహిరంగంగా పార్టీ మారి కోర్టు తీర్పు ద్వారా అనర్హత వేటుకు గురైన తొలి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ రాజకీయ చరిత్ర పుటల్లోకి ఎక్కారు, రాజ్యాంగ ప్రక్రియకు సం బంధించి విస్పష్టమైన తీర్పు నిచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్కుమార్ సింగ్, జిస్టిస్ జిఎం మొహియుద్దీన్ ఫిరాయింపు చట్టా నికి స్పష్టమైన భాష్యం చెప్పగలిగారు. నిజానికిఫిరాయిం పులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీజాలు పడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ విభజన ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ప్రత్యేక తెలంగాణ కోరుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి అక్కున చేర్చుకున్నారు. అటు పిమ్మట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆనాటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరావు కూడా తమతో కలిసివచ్చి న పరాయి పార్టీ సభ్యుల్ని చేరదీశారు. మళ్లీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేపంధాలో నడిచింది. ఫిరా యింపులపై బిఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకరు ఎదు ట చాలాకాలం కాలయాపన పర్వం సాగింది. కోర్టుల జోక్యంతో స్పీకరుకు గడువులు నిర్ణయించడంతో త్వరలో తీర్పు చెప్పక తప్పలేదు. వాటిపై ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మె ల్యేలు హైకోర్టు ట్రిబ్యునల్న ఆశ్రయించారు. సాధారణం గా ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయమే శిరో ధార్యం.

 High Court

ఫిరాయింపుదారులు పునరాలోచిం చుకోవలసిన సమయం

స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై కోర్టులో జోక్యం చేసుకునే అవకాశాలు బహు తక్కువ. కానీ ప్రస్తుత ఫిర్యాదులపై ధర్మాసనం జోక్యం చేసుకునే అంశంలో గత తీర్పులననుసరించి స్పీకరు నిర్ణ యాలపై కోర్టులు న్యాయ సమీక్ష చేసుకోవడం ఆర్టికల్ 226 కింద సబబే నని న్యాయసూత్రాలు చెబుతున్నాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద కిహోటో హోలో హన్ వెర్సన్ జాచిల్లు కేసులో 1992లో సుప్రీంకోర్టు తీర్పుప్రకారం స్పీకర్ నిర్ణయంలో రాజ్యాంగపరమైన నిబంధనలు సహజ సూత్రాల ఉల్లంఘన వంటి అంశాలుంటే న్యాయ సమీక్షకు ఆస్కారముంటుందనే ధర్మాసనమే సమర్ధించు కుంది. ప్రస్తు త ఫిరాయింపు కేసులో తీర్పు ఒక తెలం గాణకే పరిమితం కాదు. దేశంలోని అన్ని రాజ్యాంగ సభల సభ్యత్వ నియమావళికి ఒక మార్గదర్శనంగా మిగ లనుంది. భవిష్యత్ తీర్పులకు ఈ తీర్పే అనుసరణీయ మౌతుంది. ఈ కేసులో ‘అనర్హత’ ఒక్కటే కాదు. దానిని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురావాలన్న దానిపై ధర్మాసనం చర్చించి తాను గెలిచిన పార్టీ నుంచి కాక మరో పార్టీపై లోక్సభకు పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన తేదీ 2024 ఏప్రిల్ 23 నుంచే అమల్లోకి వస్తుం దని ఖాయం చేయడం విశేషం. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు ధర్మాసనం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవ డంలో మిగితా పార్టీ ఫిరాయింపుదారులు పునరాలోచిం చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించే చేష్టలు ఎప్పటికైనా పీకపట్టుకుంటాయని ఈ తీర్పు హెచ్చరించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. గణేశ్ నిమజ్జన ఆంక్షలపై ఉత్సవ సమితి రచ్చ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha