Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు!

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు!

వార్త 4 days ago

Gold Rate Today Hyderbad: గత కొన్ని రోజులుగా వరుసగా క్షీణిస్తూ వచ్చిన పసిడి ధరలు బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్ప ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.

అయితే, పసిడి నడకకు భిన్నంగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు (10 గ్రాములకు)

బుధవారం ఉదయం మార్కెట్ సరళిని పరిశీలిస్తే.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 మేర పెరిగి రూ.1,40,410 వద్ద నిలిచింది. అలాగే, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.10 పుంజుకుని రూ.1,53,170కి చేరింది. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల ధర రూ.1,53,160గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,14,880గా నమోదైంది.

Read also: Stock Market: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Gold Rate Today Hyderbad: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు

బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ప్రేమికులకు మాత్రం మార్కెట్ కాస్త ఊరటనిచ్చింది. బులియన్ మార్కెట్లో వెండి ధరల్లో స్వల్ప క్షీణత కనిపించింది. 100 గ్రాముల వెండిపై రూ.10 తగ్గి రూ.26,990కి చేరింది. అదేవిధంగా, కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ.2,69,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha