Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వర్గీయ హరికృష్ణ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్!

స్వర్గీయ హరికృష్ణ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్!

వార్త 2 weeks ago

Harikrishna 70th Jayanthi: నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు.

సోషల్ మీడియా వేదికగా హరికృష్ణతో తమకున్న పేగుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను స్మరించుకుంటూ భావోద్వేగపూరిత నివాళులర్పించారు.

Read Also:Jr NTR: హరికృష్ణ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

Harikrishna 70th Jayanthi: చంద్రబాబు, లోకేశ్ నివాళులు & ముఖ్యాంశాలు

"మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసిన హరికృష్ణ గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు" అని చంద్రబాబు ఆత్మీయంగా పేర్కొన్నారు. "టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజా నేతగా అందరి ప్రేమాభిమానాలను పొందారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా, తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు" అని లోకేశ్ స్మరించుకున్నారు. నందమూరి తారక రామారావు గారి చైతన్య రథ సారథిగా, సినీ నటుడిగా, రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు గుర్తుచేసుకున్నారు.

Epaper: epaper.vaartha.com

నేడు మహానేత వైఎస్సార్‌ 17వ వర్ధంతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha