Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వర్ణ నియోజకవర్గాల కోసం విజన్ ప్లానింగ్: చంద్రబాబు

స్వర్ణ నియోజకవర్గాల కోసం విజన్ ప్లానింగ్: చంద్రబాబు

వార్త 3 weeks ago

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రత్యేక యూనిట్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి దిశానిర్దేశం చేశారు.

శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందితో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన ప్రణాళికల అమలుపై సమీక్షించారు.

ఒకే తరహా అభివృద్ధి నమూనా కాకుండా :

ప్రతి నియోజకవర్గానికి ఒకే తరహా అభివృద్ధి నమూనా కాకుండా, స్థానిక వనరులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అవకాశాలను ఆధారంగా చేసుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించి, సాంకేతికతను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూపొందించిన డేటా లేక్‌ను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.

స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ప్రధాన లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారం, మెరుగైన పాలన, నియోజకవర్గాల ఆదాయ వృద్ధి ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో తలసరి ఆదాయం పెంచేందుకు పరిశ్రమలు, పెట్టుబడులు, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన పరిశ్రమలు వాస్తవంగా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఏర్పాటు అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంక్షేమ పథకాల విషయంలో కేవలం లబ్ధిదారులకు నగదు సాయం అందించడం మాత్రమే ప్రభుత్వ లక్ష్యం కాదని, వారిని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా, సాధికారత వైపు నడిపించడమే అసలు ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచేలా P4 వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను నిరంతరం సమీక్షించాలని, తనిఖీలు కేవలం మొక్కుబడిగా కాకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సాగాలని చంద్రబాబు ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను ప్రజలకు వివరించి, వారిని ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ విధానం ద్వారా ప్రతి నియోజకవర్గానికి స్థానిక అవసరాలకు అనుగుణమైన అభివృద్ధి బ్లూప్రింట్ రూపొందించి, స్వర్ణాంధ్ర లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఫారం-8తో ఓటును వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు: ఈసీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha