Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వర్ణం గెలిచిన టీమిండియాపై బీసీసీఐ ప్రశంసలు

స్వర్ణం గెలిచిన టీమిండియాపై బీసీసీఐ ప్రశంసలు

వార్త 2 weeks ago

Asian Games Cricket: ఆసియా క్రీడల క్రికెట్‌ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయంపై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాకిస్థాన్‌పై గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమేనని, ప్రస్తుతం వైట్‌బాల్‌ క్రికెట్‌లో భారత్ తిరుగులేని ‘సూపర్‌ పవర్‌’గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Read Also : India vs Pakistan: ఆసియా క్రీడల్లో భారత్ vs పాక్ పోరు

 BCCI praises Team India for winning gold.

Asian Games Cricket: శ్రేయస్ అయ్యర్ టాస్ విజయం.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ధమాకా

ఫైనల్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రారంభించాడు. పవర్‌ప్లేలోనే పాక్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ 7 సిక్సర్లు, 3 ఫోర్లతో కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ మొత్తం 28 బంతుల్లో 217.85 స్ట్రైక్‌రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్‌ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్), శివమ్‌ దూబే (15 బంతుల్లో 27) ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించడంతో భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.

హసన్ నవాజ్ ఒంటరి పోరాటం..

212 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు హసన్‌ నవాజ్‌ ఆసరాగా నిలిచాడు. ఆయన 51 బంతుల్లో 96 పరుగులతో చివరి వరకు పోరాడి భారత్‌ను ఒత్తిడికి గురిచేశాడు. అయితే మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. ఆఖరి బంతికి హసన్‌ నవాజ్‌ను శివమ్ దూబె అవుట్ చేయడంతో పాకిస్థాన్ 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగులతో ఘన విజయం సాధించి పురుషుల క్రికెట్‌లో వరుసగా రెండో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

పాక్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణం కైవసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha