Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20 WC 2026: 23 ఏళ్ల క్రితం కూడా శివరాత్రి రోజే

T20 WC 2026: 23 ఏళ్ల క్రితం కూడా శివరాత్రి రోజే

వార్త 3 months ago

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇండియా-పాక్ పోరు ఎప్పుడూ ప్రత్యేకమే.

ఇరుజట్ల మధ్య కొలంబో ఆతిథ్యమిచ్చిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత్‌.. 61 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించి సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకుంది. అదీగాక ఐసీసీ టీ20 టోర్నీల్లో పాక్‌పై భారత ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది.

IND vs PAK: పాక్‌పై భారత్ విజయం.. అంబరాన్నంటిన సంబరాలు

శివరాత్రి రోజే

ఈ గెలుపుతో అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇండియా-పాక్ పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్‌లో మరోసారి భారత్ పైచేయి సాధించడం క్రీడాభిమానుల్లో గర్వాన్ని నింపింది. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్‌తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో ఫిబ్రవరి 15నే పాక్‌ను మన జట్టు ఓడించింది.

ఆ మ్యాచ్‌కు ముందు సచిన్ తీవ్రమైన వెన్నునొప్పి, కాలి గాయాలతో బాధపడుతున్నప్పటికీ, దేశం కోసం మైదానంలోకి దిగి అసాధారణ పోరాటాన్ని కనబరిచారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి హేమాహేమీలతో కూడిన పాక్ బౌలింగ్ దళాన్ని సచిన్ తన బ్యాటింగ్‌తో చెల్లాచెదురు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

IND vs PAK: ఈ విజయం భారత్‌ కు అంకితం: సూర్యకుమార్ యాదవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha