Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం

T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం

వార్త 4 months ago

సీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు మరో, విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై అతి కష్టంగా గెలుపొందిన పాకిస్థాన్..

రెండో మ్యాచ్‌లో సమష్టిగా ఆధిపత్యం చెలాయించింది. గ్రూప్-ఏలో భాగంగా కొలంబో వేదికగా అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

పరుగులు సాధించడం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73 పరుగులు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ భారీ స్కోరు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా గట్టిగానే పోరాడింది. శుభమ్ రంజానె (30 బంతుల్లో 51), షయాన్ జహంగీర్ (34 బంతుల్లో 49) అద్భుతంగా రాణించారు. అయితే, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దూరమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 3 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ 2 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha