Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడిపత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించెను: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించెను: జేసీ ప్రభాకర్ రెడ్డి

వార్త 2 months ago

Tadipatri: తాడిపత్రి అభివృద్ధి విషయంలో ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.తాడిపత్రి అభివృద్ధి కీ అడ్డుపడితే ఊరుకునేది లేదని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ దినపత్రికలో పెన్నా నదిని అక్రమణ అని కథనం రాశారని,వాళ్లకు కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియదన్నారు.

Read Also: Shinganamala MLA: వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

Tadipatri: పెన్నా నది ఆక్రమణలపై క్లారిటీ

ఒకసారి ఆలయాన్ని సందర్శించి వార్తలు రాస్తే బాగుంటుంది.శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపము ప్రహరీ గోడలు శిథిలావస్థకు చేరాయని, వాటిని నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. పెన్నానది ని ఆక్రమించుకునేంత గతి నాకు పట్టలేదన్నారు.గతంలో మురికి నీరు, వరద నీరు ప్రవాహం వల్లే ప్రహరీ గోడలు కుంగిపోయాయని,వరద నీరును మలుపు తిప్పెందుకే సొంత నిధులతో పెన్నానది పూడుస్తున్నామన్నారు.

టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ గా తాడిపత్రి ని చేయాలనేదే మా సంకల్పంమన్నారు.పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేసింది వైసీపీ వాళ్ళని గుర్తు చేశారు.గతంలో అక్రమాలకు పాల్పడింది మీరేనని,కోర్టుకు వెళ్లడం మీకు అలవాటే కదా అన్నారు.కోర్టుకు వెళ్లిన తాడిపత్రి ప్రజలు అభివృద్ధి పనులను ఆపరన్నారు.2027 నాటికి తాడిపత్రి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

వైకాపా సీనియర్ నాయకుడు ఆకులేడు రామచంద్రారెడ్డి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha