Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా యోగాంధ్ర-2026 కార్యక్రమం!

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా యోగాంధ్ర-2026 కార్యక్రమం!

వార్త 2 weeks ago

Tadipatri Yogandhra 2026 |తాడిపత్రి, జూన్ 18 (ప్రభాతవార్త): యోగాంధ్ర - 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం తాడిపత్రి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో "యోగాంధ్ర" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యోగా మాస్టార్లు డా. ఏ. మురళీకృష్ణ, రవిప్రసాద్, గోవిందరెడ్డి, మమతా కర్నూలు, ఎం. రాజశేఖర్ రెడ్డి, తిప్పయ్యలు జిల్లా కలెక్టర్ ఆనంద్, తాడిపత్రి మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ భూమా నాగరాగిణి, అధికారులు, విద్యార్థులు మరియు ప్రజలతో కలిసి యోగాసనాలు చేయించి స్ఫూర్తిని నింపారు.

రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. సాధారణంగా అరకు, గండికోట వంటి ప్రాంతాలు మాత్రమే ప్రజలకు ఎక్కువగా గుర్తుంటాయని, తాడిపత్రి వంటి ప్రాచీన దేవాలయాల ప్రాముఖ్యతను రాష్ట్రవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 ‘Yoga Andhra 2026’ program under the aegis of the District Collector.

తాడిపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా స్థానిక పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు మరింత గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. త్వరలో గుత్తి కోట వద్ద కూడా ఇలాంటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Tadipatri Yogandhra 2026: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

ప్రజలు యోగా, ప్రాణాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందుతారని, అనేక రోగాలు దరిచేరకుండా నివారించవచ్చని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, ఆయుష్ వైద్యాధికారి డా. తిరుపతి నాయుడు, సివిల్ సప్లై డీఎం రమేష్ రెడ్డి, డ్వామా పీడీ సలీం భాష, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, తహసీల్దార్ రవిచంద్ర, ఎంపీడీఓ చలపతి, డీఈ రాంప్రసాద్ రెడ్డి, ఏఈలు నాగేంద్ర, తేజ, ఏక్నాథ్, ఎంఈఓలు నాగరాజు, రామ గోవిందరెడ్డి, ఇతర అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha