Tadipatri Mega Medical Camp: సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉన్నత ఆశయంతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో చారిత్రాత్మక ఉచిత మెగా వైద్య శిబిరం (Free Mega Medical Camp) విజయవంతంగా ముగిసింది.
తాడిపత్రి పట్టణంలోని దూదేకుల సేవా సంఘం (Dudekula Seva Sangham Tadipatri) ఆధ్వర్యంలో, అనంతపురానికి చెందిన ప్రముఖ మల్టీ స్పెషాలిటీ 'కిమ్స్ సవేరా ఆసుపత్రి' (KIMS Savera Hospital Anantapur) సౌజన్యంతో ఆదివారం నాడు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
స్థానిక దూదేకుల సేవా సంఘ కార్యాలయ ఆవరణలో తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ శిబిరానికి తాడిపత్రి రూరల్ మరియు టౌన్ పరిధిలోని వందలాది మంది రోగులు, వృద్ధులు తరలివచ్చారు.
గుండె, కంటి జబ్బులపై ప్రత్యేక ఫోకస్ - 'ఆరోగ్యశ్రీ' కింద ఉచిత ఆపరేషన్లు
ఈ మెగా వైద్య శిబిరంలో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రజలను ఎక్కువగా వేధిస్తున్న గుండె జబ్బులు (Heart Diseases) మరియు కంటి జబ్బులకు (Eye Diseases) సంబంధించిన వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. కిమ్స్ సవేరా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ నాగేష్ (Dr. Nagesh), ఈసీజీ సాంకేతిక నిపుణులు హనుమంతు, కంటి వైద్య నిపుణులు ఇర్ఫాన్ మరియు మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సాంబ, ఏయా, ప్రతిమ, మోహన్ రెడ్డిల బృందం క్యాంపునకు హాజరైన బాధితులకు అత్యాధునిక పరికరాలతో ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. ఈ శిబిరంలో ప్రాథమిక పరీక్షల అనంతరం గుండె ఆపరేషన్లు (కార్డియాక్ సర్జరీలు) మరియు కంటి శుక్లాల ఆపరేషన్లు (Cataract Surgeries) అవసరమని తేలిన రోగులందరికీ, ప్రభుత్వ 'డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ' (YSR Aarogyasri) పథకం కింద అనంతపురంలోని తమ కిమ్స్ సవేరా ప్రధాన ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా వంద శాతం ఉచితంగా సర్జరీలు నిర్వహిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు.
Tadipatri Mega Medical Camp: ఏటా కొనసాగుతున్న ఆనవాయితీ - రోగులకు భోజన సదుపాయం
తాడిపత్రిలో పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఏడాది దూదేకుల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు కొనియాడారు. ఈ ఏడాది కూడా సుదూర ప్రాంతాల నుండి ఎండ తీవ్రతను తట్టుకుని వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులకు, వారి సహాయకులకు దూదేకుల సేవా సంఘం ప్రతినిధులు సొంత ఖర్చులతో పౌష్టికాహార అల్పాహారం (Breakfast) మరియు మధ్యాహ్నం రుచికరమైన ఉచిత భోజన సౌకర్యాన్ని (Meals) కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

తాడిపత్రి పరిధిలో విసృ్తత సేవా దృక్పథంతో సాగిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో తాడిపత్రి దూదేకుల సేవా సంఘం అధ్యక్షులు హుస్సేన్ పీరా, ఉపాధ్యక్షులు వి. హుస్సేన్ పీరా, కోశాధికారి మహబూబ్ సాహెబ్, గౌరవాధ్యక్షులు నేతాజీ దస్తగిరి, పద్మవాణి హైస్కూల్ అధినేత నాగపీరయ్యతో పాటు ప్రముఖ సామాజిక నాయకులు సంజప్ప, మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, నబీ రసూల్, మహమ్మద్ అలీ, మస్తాన్, బాబయ్య, నసరుద్దీన్, మహమ్మద్ రఫీ, కుళ్ళాయప్ప, కడియాల హాజీ, మెకానిక్ దస్తగిరి, నజీర్, అబ్దుల్లా మరియు దూదేకుల సంఘం రెస్క్యూ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com
విశాఖ సముద్రంలో మత్స్యకారుల గల్లంతు.. రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

