Brazil Tragedy: బ్రెజిల్ లోని సావో పాలో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వీకెండ్‌లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్‌ను వాడుకలో లేని ఓ వంతెన అంచుకు తీసుకెళ్లి కొందరు కిందకు నెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి ఆమె కిందపడగా, ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర సహాయక సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అయితే, ఆ ముగ్గురు వ్యక్తులు హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆ యువతిని అలా వదిలేశారా లేక అలాంటి ఉద్దేశం లేకపోయినా ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక వార్తా వెబ్‌సైట్ 'గ్లోబో' వెల్లడించింది. సావో పాలో రాష్ట్రంలోని లిమెయిరా, కోర్డెయిరోపోలిస్ పట్టణాల సరిహద్దులో ఉన్న పొంటే దొ ఎస్కెలెటో దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
Read Also: 'The Order of the White Double Cross' : ప్రధాని మోదీకి స్లొవేకియా అత్యున్నత పురస్కారం
Brazil Tragedy:
Brazil Tragedy: సామాజిక మాధ్యమాల్లో వైరల్
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో తెల్లటి హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు యువతి చేతులను పట్టుకుని ఉండగా, మరో వ్యక్తి ఆమె కాళ్లను పట్టుకుని కనిపిస్తున్నారు. యువతిని వంతెనపై నుంచి నెట్టేసిన వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు తాడును అమర్చాలని సిబ్బందిను హెచ్చరిస్తూ అరుస్తున్నట్లు వీడియోలో ఉంది. అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తులు తాడుకు అనుసంధానించిన హార్నెస్‌లు ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే యువతికి అలాంటి రక్షణ పరికరాలు అమర్చలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్ అంత్యక్రియలు మరుసటి రోజే నిర్వహించారు. రోప్ జంపింగ్ అనేది బంజీ జంపింగ్‌కు భిన్నమైన సాహస క్రీడ. ఇందులో తక్కువ సాగుదల కలిగిన తాళ్లను ఉపయోగిస్తారు. కిందకు పడే వేగాన్ని అవి అడ్డంగా పెండ్యులమ్ వంటి కదలిక మాదిరిగా మారుస్తాయి. బంజీ జంపింగ్‌లో మాత్రం సాగే గుణం ఉండే రబ్బరు తాడును ఉపయోగించడం వల్ల పైకి, కిందికి ఊగే కదలిక ఏర్పడుతుంది.
కాబోయే భర్త కళ్లముందే విషాదం
ఈ ఘటనను యువతి కాబోయే భర్త ప్రత్యక్షంగా చూశాడు. తన కళ్లముందే ఆమె పడిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై స్పృహ కోల్పోయాడు. అనంతరం అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జంప్‌కు కొద్దిసేపటి ముందు ఫ్రైటాస్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులో ప్రమాద హెచ్చరిక బోర్డు ఫొటో కూడా ఉంది. 'నన్ను వంతెనపై నుంచి దూకడానికి అనుమతించిన పిచ్చివాడు ఎవరు?' అంటూ సరదాగా చేసిన ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

